Share News

గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ లాభంలో 70 శాతం వృద్ధి

ABN , Publish Date - May 05 , 2026 | 05:46 AM

గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌.. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.3,806.65 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.649.88 కోట్ల నికర లాభాన్ని...

గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ లాభంలో 70 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌.. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.3,806.65 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.649.88 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే లాభం 70 శాతం (రూ.381.99 కోట్లు) వృద్ధి చెందింది. కాగా మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ.8,410.88 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.1,850.20 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ డైరెక్టర్ల బోర్డు రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.10 (200 శాతం) డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

ఈ వార్తలూ చదవండి:

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ జోరు.. సన్ టీవీ షేర్లు పతనం..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 05 , 2026 | 05:46 AM