Share News

గోద్రేజ్‌ క్యాపిటల్‌ గూటికి

ABN , Publish Date - Jul 23 , 2026 | 03:12 AM

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కనకదుర్గ ఫైనాన్స్‌కు చెందిన గోల్డ్‌ లోన్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు...

గోద్రేజ్‌ క్యాపిటల్‌ గూటికి

కనకదుర్గ ఫైనాన్స్‌ గోల్డ్‌ లోన్‌ వ్యాపారం

  • ఒప్పందం విలువ రూ.117 కోట్లు

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కనకదుర్గ ఫైనాన్స్‌కు చెందిన గోల్డ్‌ లోన్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు గోద్రేజ్‌ క్యాపిటల్‌ బుధవారం ప్రకటించింది. తన అనుబంధ విభాగమైన గోద్రేజ్‌ ఫైనాన్స్‌ ద్వారా ఈ కొనుగోలు చేపట్టింది. ఈ ఒప్పందం విలువ రూ.117 కోట్లు. గోద్రేజ్‌ క్యాపిటల్‌కు ఇదే తొలి కొనుగోలు. కన్స్యూమర్‌ ఫైనాన్స్‌ విభాగంలో తన ఉనికిని పెంచుకునే లక్ష్యంతో ఈ టేకోవర్‌ చేసింది. ఆర్‌బీఐ నమోదిత నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ) అయిన కనకదుర్గ ఫైనాన్స్‌.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లోనూ కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థ పాత, కొత్త వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్లు, కార్లు, స్కూల్‌ బస్సులకు ఫైనాన్స్‌ కల్పిస్తోంది. అలాగే, బంగారం తనఖాపైనా రుణాలందిస్తోంది. గోల్డ్‌ లోన్‌ వ్యాపారం ఏపీలో 54 బ్రాంచీలతో దాదాపు 12,000 మంది కస్టమర్లను కలిగి ఉంది. ఈ విభాగంలోని నిర్వహణ ఆస్తుల విలువ రూ.280 కోట్లుగా ఉంది.

ఇవి కూడా చదవండి..

2028 నుంచి 100% సుంకాలు, ఆ తర్వాత 200%.. జనరిక్ మందులపై ట్రంప్ కీలక నిర్ణయం..

పసిడి ధరలు మరింత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 23 , 2026 | 03:12 AM