Share News

రూ.300 కోట్లతో నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్టు విస్తరణ

ABN , Publish Date - Jul 09 , 2026 | 03:02 AM

వివిధ దశల్లో నాగ్‌పూర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును విస్తరించి, ఆధునికీకరించాలని జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ నిర్ణయించింది..

రూ.300 కోట్లతో నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్టు విస్తరణ

  • జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌

నాగ్‌పూర్‌ (మహారాష్ట్ర): వివిధ దశల్లో నాగ్‌పూర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును విస్తరించి, ఆధునికీకరించాలని జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎయిర్‌పోర్ట్‌ మౌలిక సదుపాయాలను ఆధునీకరించి, ప్రయాణికుల వార్షిక రాకపోకల సామర్ధ్యాన్ని మూడు కోట్లకు విస్తరించనుంది. ఇందుకోసం రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. ఈ ఎయిర్‌పోర్టు నిర్వహణ, ఆధునికీకరణ పనులు నెల రోజుల క్రితమే జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌కు అప్పగించారు. దీంతో వేగంగా విస్తరిస్తున్న దేశ వైమానిక రంగంలో తమ పాత్ర మరింత పెరుగుతుందని జీఎంఆర్‌ గ్రూపు ఈడీ ఎస్‌జీకే కిషోర్‌ చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. ఒక్కరోజులో రూ.8.4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి

ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌న్యూస్‌..!

Updated Date - Jul 09 , 2026 | 03:02 AM