రూ.600 కోట్లతో జీఎంఆర్ ఏరో టెక్నిక్ విస్తరణ
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:04 AM
జీఎంఆర్ గ్రూప్‌లోని జీఎంఆర్ ఏరో టెక్నిక్ తన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్‌ఓ) సామర్థ్యాలను మరింతగా పెంచుకోవడంపై...
న్యూఢిల్లీ: జీఎంఆర్ గ్రూప్‌లోని జీఎంఆర్ ఏరో టెక్నిక్ తన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్‌ఓ) సామర్థ్యాలను మరింతగా పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఇందుకోసం హైదరాబాద్‌లోని తన కేంద్రంలో దాదాపు రూ.600 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. అంతేకాకుండా దేశంలో తొలిసారిగా వైడ్ బాడీ విమానాలకు పెయింటింగ్ సర్వీసును కూడా అందించాలని యోచిస్తోంది. రానున్న కాలంలో విదేశీ అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో ఈ విస్తరణను చేపడుతోంది. ఇందులో భాగంగా 2029 నాటికి హైదరాబాద్ కేంద్రం సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసి సుమారు 18 లైన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో వైడ్ బాడీ విమానాల కోసం మరో మూడు లైన్లు ఉండనున్నాయి. మొత్తంగా ఏడు వరకు ఇలాంటి విమానాలను ఉంచగల సామర్థ్యం అందుబాటులోకి రానుంది. తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
దీపావళి బాణసంచా ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు