స్థలాల లీజులో జీసీసీలే టాప్
ABN , Publish Date - Feb 26 , 2026 | 05:59 AM
విదేశీ సంస్థలు, ప్రధానంగా అమెరికన్ కంపెనీలు భారత్‌లోని 7 ప్రధాన నగరాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటు కోసం గత ఐదేళ్లలో 10.1 కోట్ల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అద్దెకు...
ఐదేళ్లలో 10 కోట్ల చదరపు అడుగులకు ఒప్పందాలు
కొలియర్స్ ఇండియా వెల్లడి
న్యూఢిల్లీ: విదేశీ సంస్థలు, ప్రధానంగా అమెరికన్ కంపెనీలు భారత్‌లోని 7 ప్రధాన నగరాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటు కోసం గత ఐదేళ్లలో 10.1 కోట్ల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా వెల్లడించింది. అందులో 71 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అమెరికన్ కంపెనీలే తీసుకున్నాయి. 2020-2025 మధ్యకాలంలో హైదరాబాద్ సహా ఏడు ప్రధాన నగరాల్లో స్థూలంగా 28.02 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజు ఒప్పందాలు కుదిరాయని.. అందులో జీసీసీల కోసం విదేశీ కంపెనీలు అద్దెకు తీసుకున్న స్థలం వాటా 36 శాతమని పేర్కొంది. రాబోయే కాలంలో విదేశీ కంపెనీలు భారత్‌లో జీసీసీల ఏర్పాటు కోసం ఏటా 3.5-4.0 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకోవచ్చని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ విభాగం ఎండీ అర్పిత్ మెహ్రోత్రా అంచనా వేశారు. గత ఏడాది దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 7.15 కోట్ల చదరపు అడుగుల కార్యాలయ స్థలం లీజుకు తీసుకోగా.. అందులో విదేశీ కంపెనీలు 2.92 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను అద్దెకు తీసుకున్నాయి. మొత్తం లీజులో 41 శాతానికి ఇది సమానం.
ఇవి కూడా చదవండి..
మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ ఫొటోలో HOT పదాన్ని 5 సెకెన్లలో కనుగొనండి..
ప్రియురాలి పెళ్లికి వచ్చిన ప్రియుడు.. అందరూ చూస్తుండగా ఏం చేశాడంటే.