కార్యాలయాల స్థలాలకు విదేశీ జీసీసీల దన్ను
ABN , Publish Date - Apr 07 , 2026 | 03:19 AM
భారత్‌లో తమ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాలు (జీసీసీ)లు ఏర్పాటు చేసేందుకు విదేశీ కంపెనీలు ఎగబడుతున్నాయి. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య ఈ సంస్థలు...
జనవరి-మార్చి మధ్య కాలంలో
91 లక్షల ఎస్‌ఎ్‌ఫటీ లీజు: సీబీఆర్‌ఈ
న్యూఢిల్లీ: భారత్‌లో తమ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాలు (జీసీసీ)లు ఏర్పాటు చేసేందుకు విదేశీ కంపెనీలు ఎగబడుతున్నాయి. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య ఈ సంస్థలు ఇందుకోసం దేశంలోని తొమ్మిది నగరాల్లో రికార్డు స్థాయిలో 91 లక్షల చదరపు అడుగుల (ఎస్‌ఎ్‌ఫటీ) కార్యాలయ భవనాలను లీజుకు తీసుకున్నాయి. ఇందులో 73 శాతం ఆఫీసు స్పేస్‌ను అమెరికా కంపెనీలు తీసుకున్నాయి. ఈ సంస్థలు ఎక్కువగా హరిత భవనాలు, అద్భుతమైన వసతులు ఉన్న భవనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ తెలిపింది. ఈ విదేశీ సంస్థల్లో పలు ఈ-కామర్స్, టెక్నాలజీ, బీఎ్‌ఫఎ్‌సఐ కంపెనీలు ముందున్నాయి. ఇతర సంస్థలను కూడా పరిగణనలోకి తీసుకుంటే జనవరి-మార్చి మధ్య కాలంలో దేశంలోని తొమ్మిది నగరాల్లో 2.07 కోట్ల ఎస్‌ఎఫ్‌టీ కార్యాలయ భవనాల లీజు ఒప్పందాలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. ఇందులో 67 శాతం ఆఫీస్ స్పేస్ లీజు ఒప్పందాలు బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై నగరాల్లో నమోదైనట్టు సీబీఆర్‌ఈ తెలిపింది.
ఈ వార్తలూ చదవండి:
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..