Share News

హైదరాబాద్‌ రియాద్‌ మధ్య ఫ్లైఏడీల్‌ విమాన సర్వీసులు

ABN , Publish Date - Jul 07 , 2026 | 01:53 AM

సౌదియా గ్రూప్‌నకు చెందిన చవక ధరల విమానయాన సంస్థ ఫ్లైఏడీల్‌.. భారత విమానయాన మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ సంస్థ తొలి విమానం...

హైదరాబాద్‌ రియాద్‌ మధ్య ఫ్లైఏడీల్‌ విమాన సర్వీసులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సౌదియా గ్రూప్‌నకు చెందిన చవక ధరల విమానయాన సంస్థ ఫ్లైఏడీల్‌.. భారత విమానయాన మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ సంస్థ తొలి విమానం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఈ ఎయిర్‌లైన్స్‌ రియాద్‌-హైదరాబాద్‌-రియాద్‌ మార్గంలో ఎయిర్‌బస్‌ ఏ320 విమానం ద్వారా డైలీ సర్వీసులను ప్రారంభించింది. ఇది అంతర్జాతీయ ఏవియేషన్‌ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రతిష్టను, భారత్‌-సౌదీ అరేబియాను అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుందని జీఎంఆర్‌ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. భారత మార్కెట్లోకి తొలిసారిగా ప్రవేశిస్తున్న ఫ్లైఏడీల్‌ను హైదరాబాద్‌కు స్వాగతించడం సంతోషంగా ఉందని జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఎల్‌) సీఈవో కధిర్‌ కదిరవన్‌ పేర్కొన్నారు. రియాద్‌కు ఈ కొత్త విమాన సర్వీసు తమ పశ్చిమాసియా నెట్‌వర్క్‌ను మరింతగా మెరుగుపరుస్తుందన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్‌ ప్లస్‌ నిర్ణయం

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

Updated Date - Jul 07 , 2026 | 01:53 AM