Share News

ఫెడరల్‌ బ్యాంక్‌ గూటికి జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ !

ABN , Publish Date - Sep 26 , 2026 | 02:25 AM

భారత బ్యాంకింగ్‌ రంగంలో మరో విలీనానికి రంగం సిద్ధమవుతోంది. జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ను తనలో విలీనం చేసుకునేందుకు ప్రైవేట్‌ రంగంలోని ఫెడరల్‌ బ్యాంక్‌ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం

ఫెడరల్‌ బ్యాంక్‌ గూటికి జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ !
janasmallfinance banu

న్యూఢిల్లీ : భారత బ్యాంకింగ్‌ రంగంలో మరో విలీనానికి రంగం సిద్ధమవుతోంది. జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ను తనలో విలీనం చేసుకునేందుకు ప్రైవేట్‌ రంగంలోని ఫెడరల్‌ బ్యాంక్‌ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చర్చలు తుది దశలో ఉన్నట్టు తెలుస్తోంది. షేర్ల మార్పిడి ద్వారా ఈ విలీనం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై రెండు బ్యాంకులు అధికారికంగా నోరు మెదపడం లేదు. జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ను విలీనం చేసుకోవడం ద్వారా ప్రాధాన్యతా రంగా ల రుణాల పంపిణీలో పట్టు పెంచుకోవాలని ఫెడరల్‌ బ్యాంక్‌ భావిస్తోంది.

Updated Date - Sep 26 , 2026 | 02:25 AM