Share News

ఏడాది కనిష్ఠానికి ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు

ABN , Publish Date - Jun 11 , 2026 | 03:44 AM

పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో ముడి చమురు, ఎరువులు, ఇతర కమోడిటీల ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణ వంటి ప్రతికూల పరిణామాల...

ఏడాది కనిష్ఠానికి  ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు

  • మే నెలలో రూ.22,908 కోట్లకు పరిమితం

  • ఏప్రిల్‌తో పోలిస్తే 40 శాతం తగ్గుదల

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో ముడి చమురు, ఎరువులు, ఇతర కమోడిటీల ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణ వంటి ప్రతికూల పరిణామాల నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులపై రాబడులు తగ్గాయి. చాలా మంది నష్టాలు చవిచూస్తున్నారు. దాంతో మదుపరుల్లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో పెట్టుబడులపైనా ఆసక్తి తగ్గింది. అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) తాజా గణాంకాలే ఇందుకు నిదర్శనం. యాంఫీ బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ ఏడాది మే నెలలో ఈక్విటీ ఫండ్‌ పథకాల్లోకి నికర పెట్టుబడులు ఏడాది కనిష్ఠ స్థాయి రూ.22,908 కోట్లకు పడిపోయాయి. ఈ ఏప్రిల్‌లో నమోదైన రూ.38,440 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే 40 శాతం తగ్గాయి.

‘సిప్‌’ కూడా తగ్గింది..

మ్యూచువల్‌ ఫండ్ల క్రమానుగుత పెట్టుబడి పథకాల్లో (సి్‌ప)కి నిధుల ప్రవాహం తగ్గింది. గత నెలలో మదుపరులు రూ.30,954 కోట్లే సిప్‌ చేశారు. ఏప్రిల్‌లో నమోదైన రూ.31,115 కోట్లు, మార్చిలో రూ.32,087 కోట్లతో పోలిస్తే గణనీయంగా తగ్గింది.

గోల్డ్‌ ఈటీఎఫ్ లకు గుడ్‌బై!

  • గత నెలలో రూ.725 కోట్లు వెనక్కి..

పసిడి ధరలు క్రమంగా పతనమవుతున్న నేపథ్యంలో మదుపరులు గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల ్ల(ఈటీఎ్‌ఫ)కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. వరుసగా 13 నెలలుగా పెట్టుబడులు పెడుతూ వచ్చిన ఇన్వెస్టర్లు మే నెలలో గోల్డ్‌ ఈటీఎ్‌ఫల నుంచి నికరంగా రూ.725 కోట్లు వెనక్కి తీసుకున్నారు. 2025 ఏప్రిల్‌ తర్వాత వీటి నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లడం మళ్లీ ఇదే మొదటిసారి. మున్ముందు ధరలు మరింత తగ్గవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరిస్తున్నారని కమోడిటీ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏప్రిల్‌లో గోల్డ్‌ ఈటీఎ్‌ఫల్లోకి రూ.3,040 కోట్లు, మార్చిలో రూ.2,266 కోట్లు, ఫిబ్రవరిలో రూ.5,255 కోట్లు, జనవరిలో రికార్డు స్థాయిలో రూ.24,040 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తంగా చూస్తే, 2025 మే నెల నుంచి ఇప్పటివరకు గోల్డ్‌ ఈటీఎ్‌ఫలు రూ.70,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి.

ఇవి కూడా చదవండి..

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారుల మృతి..

బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..

Updated Date - Jun 11 , 2026 | 03:45 AM