భారతి బిల్డర్స్‌కు చెందిన రూ.17.97 కోట్ల ఆస్తులు జప్తు
ABN , Publish Date - Mar 24 , 2026 | 02:40 AM
స్వంత ఇంటి కలలు కన్న వారిని మోసం చేసి వారి కష్టార్జితం స్వాహా చేసిన కేసు లో భారతి బిల్డర్స్ సంస్థకు సంబంధించిన రూ.17.97 కోట్ల ఆస్తులను...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) స్వంత ఇంటి కలలు కన్న వారిని మోసం చేసి వారి కష్టార్జితం స్వాహా చేసిన కేసు లో భారతి బిల్డర్స్ సంస్థకు సంబంధించిన రూ.17.97 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. సంస్థ భాగస్వాములు, వారి కుటుంబ సభ్యులు, ఇతరుల పేర్లపై ఉన్న ఆస్తులు వీటిలో ఉన్నాయి. గతంలో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ... వీరు కస్టమర్ల నుంచి రూ.75 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించింది. .450 మంది నుంచి వారు డబ్బు ేసకరించారని, అందులో రూ.17 కోట్లు నగదు రూపంలో తీసుకున్నారని విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో సంస్థ యజమానులైన శివరామకృష్ణ, నాగరాజు, నరసింహారావుల ఆస్తులను జప్తు చేశారు.
ఇవి కూడా చదవండి
పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే..
మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం