హైదరాబాద్‌లో ఈబీజీ గ్రూప్ తయారీ, పంపిణీ హబ్
ABN , Publish Date - May 28 , 2026 | 02:39 AM
ఎలక్ట్రిక్ మొబిలిటీ, రిహాబిలిటేషన్ టెక్నాలజీ, కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్, నిర్మాణ రంగం, ఎఫ్ అండ్ బీ మౌలిక సదుపాయాలు...
రూ.25 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎలక్ట్రిక్ మొబిలిటీ, రిహాబిలిటేషన్ టెక్నాలజీ, కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్, నిర్మాణ రంగం, ఎఫ్ అండ్ బీ మౌలిక సదుపాయాలు, ఆతిథ్య రంగాల్లో ఉన్న ఈబీజీ గ్రూప్ హైదరాబాద్‌లో తన తయారీ, డిస్ట్రిబ్యూషన్ హబ్‌ను ప్రారంభించింది. రూ.25 కోట్ల పెట్టుబడితో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వజ్రం ఎలక్ట్రిక్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ హబ్‌ను వచ్చే ఏడాది 50,000 చదరపు అడుగులకు విస్తరిస్తామని ఈబీజీ గ్రూప్ వ్యవస్థాపకులు ఇర్ఫాన్ ఖాన్ చెప్పారు. దీంతో తమ గ్రూప్‌నకు చెందిన 11 రకాల వ్యాపార కార్యకలాపాలను ఇక్కడి నుంచే నిర్వహించవచ్చని తెలిపారు. ఈ హబ్ ద్వారా 450 మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి.