డీ-మార్ట్ జోరు
ABN , Publish Date - Jul 12 , 2026 | 03:40 AM
డీ-మార్ట్ రిటైల్ చెయిన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికాని...
క్యూ1లో రూ.860 కోట్ల లాభం
న్యూఢిల్లీ: డీ-మార్ట్ రిటైల్ చెయిన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికాని (క్యూ1)కి రూ.860.44 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక లాభం (రూ.772.81 కోట్లు)తో పోల్చితే వృద్ధి 11.33 శాతంగా నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రాబడి 14.9 శాతం పెరిగి రూ.16,359.70 కోట్ల నుంచి రూ.18,789.53 కోట్లకు చేరుకుంది. జూన్ త్రైమాసికంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ మొత్తం వ్యయాలు 15.11 శాతం పెరిగి రూ.17,637.17 కోట్లకు చేరాయి.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణ బులెట్ ట్రైన్స్ హబ్‌గా మారబోతోంది: అశ్వినీ వైష్ణవ్
ఐదు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్