Share News

ఢిల్లీ హైకోర్టులో ఎన్‌సీసీకి ఊరట

ABN , Publish Date - Feb 23 , 2026 | 04:03 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఎన్‌సీసీ లిమిటెడ్‌కి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన కాంట్రాక్టులు, టెండర్లలో ఎన్‌సీసీ, దాని అనుబంధ సంస్థను...

ఢిల్లీ హైకోర్టులో ఎన్‌సీసీకి ఊరట

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఎన్‌సీసీ లిమిటెడ్‌కి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన కాంట్రాక్టులు, టెండర్లలో ఎన్‌సీసీ, దాని అనుబంధ సంస్థను రెండేళ్ల పాటు పాల్గొనకుండా ఈ నెల 18న భారత జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) విధించిన నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు వచ్చే నెల 10 వరకు నిలిపి వేసింది. కంపెనీ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఒక రోడ్డు ప్రాజెక్టు ఆలస్యానికి ఎన్‌సీసీదే బాధ్యత అని ఎన్‌హెచ్‌ఏఐ ఈ నెల 18న కంపెనీపై రెండేళ్ల నిషేధం విధించింది. హైకోర్టు ఉత్తర్వులతో ఎన్‌సీసీకి ఊరట లభించింది.

ఇవీ చదవండి:

భారీ ఉగ్రకుట్ర భగ్నం! 8 మంది అరెస్టు

రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్

Updated Date - Feb 23 , 2026 | 04:03 AM