దీపా జువెలర్స్ ఐపీఓకి సెబీ ఆమోదం
ABN , Publish Date - May 23 , 2026 | 05:44 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దీపా జువెలర్స్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఆమోదం తెలిపింది....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దీపా జువెలర్స్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఆమోదం తెలిపింది. గత ఏడాది డిసెంబరు 29న కంపెనీ సెబీకి ఐపీఓ ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.250 కోట్లకు తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుండగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) ద్వారా ప్రమోటర్లు ఆశిష్ అగర్వాల్, సీమా అగర్వాల్.. 1,18,48,340 షేర్లను విక్రయించనున్నారు. 2016లో కార్యకలాపాలు ప్రారంభించిన దీపా జువెలర్స్.. ఆర్గనైజ్డ్ బీ2బీ డిజైనర్, హాల్‌మార్క్ బంగారు ఆభరణాల ప్రాసెసర్, సరఫరాదారుగా ఉంది. ప్రస్తుతం కంపెనీ తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో కార్యకలాపాలు సాగిస్తోంది.
ఇవి కూడా చదవండి:
బిహార్‌కీ ఓ ఐపీఎల్ టీమ్ ఉండాలి: బిలియనీర్ అనిల్ అగర్వాల్
సీఎస్కే వైఫల్యానికి అసలు కారణం ఇదే: సెహ్వాగ్