Share News

మధుమేహ ఔషధం డపాగ్లిఫ్లోజిన్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:37 AM

దేశీయ ఫార్మా దిగ్గజాలు అరబిందో ఫార్మా, అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌ తయారుచేసిన జనరిక్‌ ఔషధం డపాగ్లిఫ్లోజిన్‌ తయారీ, మార్కెటింగ్‌కు...

మధుమేహ ఔషధం డపాగ్లిఫ్లోజిన్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం

హైదరాబాద్‌: దేశీయ ఫార్మా దిగ్గజాలు అరబిందో ఫార్మా, అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌ తయారుచేసిన జనరిక్‌ ఔషధం డపాగ్లిఫ్లోజిన్‌ తయారీ, మార్కెటింగ్‌కు అమెరికన్‌ రెగ్యులేటర్‌ యూఎ్‌సఎ్‌ఫడీఏ తుది అనుమతి లభించింది. రెండు కంపెనీలు వేర్వేరు ప్రకటనల్లో ఈ విషయం వెల్లడించాయి. ఈ ఔషధాన్ని టైప్‌ 2 డయాబెటిస్‌ కేసుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించేందుకు ఉపయోగిస్తారు. 5 ఎంజీ, 10ఎంజీ డోసుల్లో డపాగ్లిఫ్లోజిన్‌ తయారుచేసి, మార్కెట్‌ చేసేందుకు ఈ అనుమతి వర్తిస్తుందని రెండు కంపెనీలు రెగ్యులేటరీ సంస్థలకు పంపిన సందేశంలో తెలిపాయి. ఫిబ్రవరితో ముగిసిన ఏడాది కాలంలో ఈ ఔషధం మార్కెట్‌ పరిమాణం 1020 కోట్ల డాలర్లుంది.

ఇవి కూడా చదవండి..

యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..

Updated Date - Apr 08 , 2026 | 05:37 AM