Share News

చమురు, గ్యాస్‌ భగ్గు

ABN , Publish Date - Mar 20 , 2026 | 03:10 AM

పశ్చిమాసియా యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో క్రూడాయిల్‌ ధరలు భగ్గుమన్నాయి. ప్రపంచానికి 20ు సహజవాయువు సరఫరా చేసే ఖతార్‌లోని రాస్‌ లప్ఫాన్‌ టెర్మినల్‌తో పాటు...

చమురు, గ్యాస్‌ భగ్గు

ఒక దశలో 120 డాలర్లకు చేరువైన ధర

ఒక్క రోజులో 5 శాతం పైగా పెరిగిన సహజ వాయువు

న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో క్రూడాయిల్‌ ధరలు భగ్గుమన్నాయి. ప్రపంచానికి 20ు సహజవాయువు సరఫరా చేసే ఖతార్‌లోని రాస్‌ లప్ఫాన్‌ టెర్మినల్‌తో పాటు కువైట్‌లోని రెండు చమురు రిఫైనరీలపై ఇరాన్‌ దాడితో వాటిని తాత్కాలికంగా మూసి వేయాల్సిరావడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. ఈ తాజా దాడులు చమురు, గ్యాస్‌ కొరతను మరింత తీవ్రం చేయవచ్చన్న ఆందోళనలతో వాటి ధరలు భారీగా ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడిచము రు బ్యారెల్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టు ధర ఒక దశలో 119.13 డాలర్లను తాకింది. తదుపరి క్రమంలో కాస్త తగ్గి 116.38 డాలర్ల స్థాయిలో ట్రేడైంది. అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ క్రూడాయిల్‌ రేటు 96.45 డాలర్లకు చేరుకుంది. అలాగే, యూఎస్‌ నేచురల్‌ గ్యాస్‌ ధర ఒకదశలో 5.74ు పెరిగి 3.24 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.

200 డాలర్ల దిశగా ధర..?

గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి సమయానికి బ్రెంట్‌ క్రూడాయిల్‌ రేటు 73 డాలర్ల స్థాయిలో ఉంది. గడిచిన 20 రోజుల్లో దాదాపు 120 డాలర్లకు ఎగబాకింది. అంటే, 47 డాలర్లు పెరిగింది. యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో చమురు, గ్యాస్‌ సరఫరా, ఉత్పత్తి మూడో వంతుకు పడిపోవడం ఇందుకు ప్రధాన కారణం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, క్రూడ్‌ త్వరలోనే 150 డాలర్లకు చేరుకోవచ్చని, ఇంధన క్షేత్రాలపై దాడులు తీవ్రతరమై ఉత్పత్తి, సరఫరా స్తంభించిపోతే ధర 200 డాలర్ల దిశగా పయనించవచ్చని కమోడిటీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..

మీ కళ్లు షార్ప్ అయితేనే.. ఈ ఫొటోలో పక్షిని 15 సెకెన్లలో కనిపెట్టగలరు..

Updated Date - Mar 20 , 2026 | 03:10 AM