క్రౌడ్‌స్ట్రైక్ చేతికి జెడ్‌స్కేలర్
ABN , Publish Date - Nov 25 , 2026 | 05:27 AM
హిమాచల్ ప్రదేశ్‌లోని మారుమూల గామం ‘పనో్‌హ’లో రైతు కుటుంబంలో జన్మించిన జయ్ చౌదరి.. ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంచలనాలు...
డీల్ విలువ 4,390 కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లోని మారుమూల గామం ‘పనోహ్’లో రైతు కుటుంబంలో జన్మించిన జయ్ చౌదరి.. ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారు. ఆయన స్థాపించిన జెడ్‌స్కేలర్‌ను తాజాగా 4,390 కోట్ల డాలర్లకు (సుమారు రూ.4 లక్షల కోట్లు) కొనుగోలు చేసేందుకు సైబర్ సెక్యూరిటీ దిగ్గజం క్రౌడ్‌స్ట్రైక్ ముందుకొచ్చింది. ఐఐటీ (బీహెచ్‌యూ) వారణాసిలో 1980లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన జయ్ 22 ఏళ్ల వయసులో కేవలం 200 డాలర్లతో అమెరికా వెళ్లారు. టాటా స్కాలర్‌షిప్ ఆయన ఉన్నత విద్యకు తోడ్పడింది. ఐబీఎం, యునిసిస్ సంస్థల్లో పనిచేస్తూ, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వ్యాపార నిర్వహణలోనూ అనుభవం సంపాదించారు. ఉద్యోగం వదిలేసి, భార్య జ్యోతితో కలిసి 1996లో సెక్యూర్‌ఐటీ పేరుతో తొలి సంస్థను ప్రారంభించారు. రెండేళ్లలోనే వెరిసైన్ సంస్థ 1998లో దీనిని కొనుగోలు చేసింది. ఆ తర్వాత కోర్‌హార్బర్, సిఫర్‌ట్రస్ట్, ఎయిర్‌డిఫెన్స్ వంటి మరో మూడు సంస్థలను స్థాపించి, విజయాలు సాధించారు. వీటిని కూడా ఇతర సంస్థలకు విక్రయించడం/విలీనం చేశారు. 2007లో తన ఐఐటీ సహచరుడు కైలాశ్‌తో కలిసి జెడ్‌స్కేలర్‌ను స్థాపించారు. ఈ కంపెనీ 2018లో నాస్‌డాక్‌లో నమోదైంది. తాజాగా సైబర్ భద్రతా సంస్థ క్రౌడ్‌స్ట్రైక్.. జెడ్‌స్కేలర్‌ను 4,390 కోట్ల డాలర్ల విలువైన షేర్ల మార్పిడి ఒప్పందంతో కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. ఇది పూర్తయితే సైబర్ భద్రతా రంగంలోనే అతిపెద్ద కొనుగోళ్లలో ఒకటిగా నిలవనుంది.
ఇవి కూడా చదవండి:
ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్ బర్త్‌డే విషెస్..
వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!