క్రెడిట్ కార్డ్స్: క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్స్.. ఏది బెటర్?
ABN , Publish Date - Sep 12 , 2026 | 02:32 PM
క్రెడిట్ కార్డుపై ప్రతి నెల మీరు రూ.50,000 వరకు ఖర్చు చేస్తుంటే, మీకు వచ్చే ఆఫర్లలో 'క్యాష్‌బ్యాక్', లేక 'రివార్డ్ పాయింట్లు' మేలా అనే సందేహం సహజం. వీటిలో మీ అవసరానికి తగినది ఎంచుకోవడం ద్వారా ప్రతినెల మంచి మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 12: క్రెడిట్ కార్డుపై ప్రతి నెల మీరు రూ.50,000 వరకు ఖర్చు చేస్తుంటే, మీకు వచ్చే ఆఫర్లలో 'క్యాష్‌బ్యాక్' లాభదాయకమా లేక 'రివార్డ్ పాయింట్లు' మేలా అనే సందేహం రావడం సహజం. ఈ రెండింటిలో మీ అవసరానికి తగినదాన్ని ఎంచుకోవడం ద్వారా ప్రతినెల మంచి మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.
క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ (సరళమైనది.. స్పష్టమైనది)
క్యాష్‌బ్యాక్ అనేది చాలా స్పష్టమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. మీరు ఖర్చు చేసిన మొత్తంలో కొంత శాతం నేరుగా మీ క్రెడిట్ కార్డ్ బిల్లులో మినహాయింపుగా లభిస్తుంది. ఉదాహరణకు, మీరు 2శాతం క్యాష్‌బ్యాక్ ఇచ్చే కార్డుపై రూ.50,000 ఖర్చు చేస్తే, మీకు కచ్చితంగా రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. అదే 1.5శాతం క్యాష్‌బ్యాక్ కార్డ్ అయితే రూ.750 ఆదా అవుతాయి. ఇందులో పాయింట్లు ఎప్పుడు గడువు ముగుస్తాయో అని చూడాల్సిన పనిలేదు, అలాగే రిడెంప్షన్ ఆప్షన్లను సరిచూసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే, కొన్ని కార్డులలో నెలకు గరిష్టంగా ఎంత క్యాష్‌బ్యాక్ రావాలనే దానిపై పరిమితులు (Monthly Capping) ఉంటాయి.

రివార్డ్ పాయింట్లు (ఎక్కువ విలువ పొందే అవకాశం)
క్యాష్‌బ్యాక్ లాగా రివార్డ్ పాయింట్ల విలువ స్థిరంగా ఉండదు. మీరు ఆ పాయింట్లను దేనికోసం వాడుకుంటారు (Redeem) అనేదానిపైనే వాటి అసలు విలువ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఒక కార్డు ద్వారా ప్రతి రూ.100 ఖర్చుకు 10 పాయింట్లు వస్తే, రూ.50,000 ఖర్చుపై మీకు 5,000 పాయింట్లు లభిస్తాయి.
ఈ 5,000 పాయింట్లను మీరు నేరుగా క్యాష్ రూపంలో లేదా స్టేట్‌మెంట్ క్రెడిట్‌గా వాడితే (1 పాయింట్ = 20 పైసలు అనుకుంటే) వాటి విలువ రూ.1,000 అవుతుంది.
అదే పాయింట్లను అమేజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి గిఫ్ట్ వోచర్లుగా మార్చుకుంటే (1 పాయింట్ = 25 పైసలు అనుకుంటే) వాటి విలువ రూ.1,250 వరకు ఉంటుంది.
ఒకవేళ మీరు తరచుగా ప్రయాణాలు చేసేవారైతే, ఈ పాయింట్లను ఫ్లైట్ బుకింగ్స్ లేదా ఎయిర్‌లైన్ మైల్స్/హోటల్ పాయింట్లుగా మార్చుకున్నప్పుడు ఒక్కో పాయింట్ విలువ 50 పైసల నుంచి రూ.1 వరకు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మీ 5,000 పాయింట్ల విలువ రూ.2,500 నుంచి రూ.5,000 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి..
అలా అయితే రష్యాతో యుద్ధం చేస్తున్నట్టే.. యూరప్‌నకు పుతిన్ వార్నింగ్..
భారత్‌తో విభేదాలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటాం.. కీలక భేటీకి ముందు చైనా వ్యాఖ్యలు.