కార్పొరేట్ ఎఫ్‌డీ.. రిస్కే.. కానీ రిటర్ను అధికం
ABN , Publish Date - Apr 05 , 2026 | 03:39 AM
స్టాక్ మార్కెట్ పనితీరు ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో మదుపరుల దృష్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎ్‌ఫడీ) పైకి మళ్లింది. కానీ, ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపు ఫలితంగా బ్యాంకులు రుణగ్రహీతల....
స్టాక్ మార్కెట్ పనితీరు ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో మదుపరుల దృష్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎ్‌ఫడీ) పైకి మళ్లింది. కానీ, ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపు ఫలితంగా బ్యాంకులు రుణగ్రహీతల నుంచి వసూలు చేసే వడ్డీ రేట్లతో పాటు డిపాజిట్‌దారులకు చెల్లించే వడ్డీని కూడా తగ్గిస్తూ వచ్చాయి. ప్రస్తుతం బ్యాంకులో సొమ్ము డిపాజిట్ భద్రమైన మార్గమే అయినప్పటికీ లభించే ప్రతిఫలం మాత్రం తక్కువే. ఇలాంటి తరుణంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎ్‌ఫసీ), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్‌ఎ్‌ఫసీ) ఎఫ్‌డీలు మంచి ప్రత్యామ్నాయం కాగలవు. కొంత రిస్కే అయినప్పటికీ, బ్యాంకు ఎఫ్‌డీలతో పోలిస్తే 1-2 శాతం అధిక రిటర్నులను పొందే అవకాశం ఉంటుంది. మీ అవసరాన్ని బట్టి నెల, 3 నెలలు, ఏడాదికోసారి వడ్డీ చెల్లింపు ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
రిస్క్‌ని ఎలా అంచనా వేయాలి..?
క్రిసిల్, ఇక్రా, కేర్ వంటి పరపతి రేటింగ్ ఏజెన్సీలు కేటాయించే క్రెడిట్ రేటింగ్ ఆధారంగా కార్పొరేట్ ఎఫ్‌డీల రిస్క్‌పై అంచనాకు రావచ్చు. మంచి రేటింగ్ కలిగిన ఎన్‌బీఎ్‌ఫసీలు, హెచ్‌ఎ్‌ఫసీల ఎఫ్‌డీలను ఎంచుకోవడం మేలు. తక్కువ రేటింగ్ కలిగిన కంపెనీల మరింత వడ్డీ ఆఫర్ చేసినప్పటికీ రిస్క్ ఎక్కువ. కాబట్టి మీ రిస్క్ సామర్థ్యంతో పాటు ఎంత కాలానికి సొమ్మును డిపాజిట్ చేయాలనుకుంటున్నారు..? అనే అంశాల ఆధారంగా కార్పొరేట్ ఎఫ్‌డీలను ఎంచుకోవడం మేలు. ముఖ్యంగా పెట్టుబడుల వివిధీకరణ వ్యూహంలో భాగంగా రిస్క్- రిటర్నులను సమతుల్యం చేసుకునేందుకు కార్పొరేట్ ఎఫ్‌డీలను కూడా ఎంచుకోవచ్చని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు.
ఎలాంటి రిస్క్‌లు ఉంటాయి..?
కంపెనీ ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్న సందర్భంలో మీ డిపాజిట్ సొమ్ముపై వడ్డీ లేదా అసలు కూడా చెల్లించలేకపోయే ప్రమాదం ఉంటుంది.
కొన్ని కంపెనీలు గడువుకు ముందు డిపాజిట్ సొమ్ము ఉపసంహరణపై ఆంక్షలు విధిస్తుంటాయి. అలాంటప్పుడు అత్యవసరానికి ఆ ఎఫ్‌డీని కాలపరిమితి కంటే ముందే విత్‌డ్రా చేసుకునే వీలుండదు. ఒకవేళ గడువుకు ముందే విత్‌డ్రా చేసుకోగలిగినా అధిక పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు.
బ్యాంకు డిపాజిట్లకు రూ.5 లక్షల వరకు బీమా కవరేజీ లభిస్తుంది. అంటే, బ్యాంక్ దివాలా తీసినా మీ సొమ్ముకు భద్రత ఉంటుంది. కానీ కార్పొరేట్ ఎఫ్‌డీలకు అలాంటి సౌకర్యం ఉండదు.
ప్రస్తుతం ఆయా ఫైనాన్స్ కంపెనీలు
ఆఫర్ చేస్తున్న ఎఫ్‌డీ పథకాల వివరాలు..
శ్రీరామ్ ఫైనాన్స్
గరిష్ఠ వార్షిక వడ్డీ రేటు : 7.60%
(సీనియర్ సిటిజన్లకు మరో 0.50ు అధికం)
కాలపరిమితి : 3-5 ఏళ్లు
మహీంద్రా ఫైనాన్స్
గరిష్ఠ వార్షిక వడ్డీ రేటు : 7.00%
(సీనియర్ సిటిజన్లకు
0.20-0.35% వరకు అధికం)
కాలపరిమితి : 2-5 ఏళ్లు
మణిపాల్ హౌసింగ్ ఫైనాన్స్ సిండికేట్ లిమిటెడ్
గరిష్ఠ వార్షిక వడ్డీ రేటు : 8.25%
(సీనియర్ సిటిజన్లకు 0.25ు అధికం)
కాలపరిమితి : 1-3 ఏళ్లు
పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్
గరిష్ఠ వార్షిక వడ్డీ రేటు : 6.90%
(సీనియర్ సిటిజన్లకు 0.25ు అధికం)
కాలపరిమితి : 3-5 ఏళ్లు
సుందరం హోమ్ ఫైనాన్స్
గరిష్ఠ వార్షిక వడ్డీ రేటు : 7.15%
(సీనియర్ సిటిజన్లకు 0.35- 0.50ు అధికం)
కాలపరిమితి : 4-5 ఏళ్లు
ముత్తూట్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్
గరిష్ఠ వార్షిక వడ్డీ రేటు : 8.95%
(సీనియర్ సిటిజన్లకు 0.25% అధికం)
కాలపరిమితి : 36 నెలల వరకు
ఐసీఐసీఐ హోమ్ ఫైనాన్స్
గరిష్ఠ వార్షిక వడ్డీ రేటు : 7.10%
(సీనియర్ సిటిజన్లకు 0.35% అధికం)
కాలపరిమితి : 45 నెలల వరకు
కెన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్
గరిష్ఠ వార్షిక వడ్డీ రేటు : 7.50%
(సీనియర్ సిటిజన్లకు 0.25-0.50% అధికం)
కాలపరిమితి : 3 ఏళ్లు
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్
గరిష్ఠ వార్షిక వడ్డీ రేటు : 6.95%
(సీనియర్ సిటిజన్లకు 0.35ు అధికం)
కాలపరిమితి : 2-5 ఏళ్లు
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్
గరిష్ఠ వార్షిక వడ్డీ రేటు : 6.90%
(సీనియర్ సిటిజన్లకు 0.25ు అధికం)
కాలపరిమితి : 5 ఏళ్ల వరకు
ఇవి కూడా చదవండి
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం
‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే... జరిగింది!