Share News

కోల్‌ ఇండియాలో 2 శాతం వాటా విక్రయం

ABN , Publish Date - May 27 , 2026 | 05:17 AM

ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి దిగ్గజం కోల్‌ ఇండియాలో 2 శాతం వరకు ఈక్విటీ వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా...

కోల్‌ ఇండియాలో 2 శాతం వాటా విక్రయం

షేరు కనీస ధర రూ.412

నేడే ఓఎఫ్ఎస్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి దిగ్గజం కోల్‌ ఇండియాలో 2 శాతం వరకు ఈక్విటీ వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా విక్రయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. షేరు కనీస ధరను రూ.412గా నిర్ణయించింది. బీఎ్‌సఈలో కోల్‌ ఇండియా షేరు మంగళవారం ముగింపు ధర రూ.458.25తో పోలిస్తే 10 శాతం తక్కువిది. ఈ ఆఫర్‌ ఫర్‌ సేల్‌.. నాన్‌ రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఈ నెల 27న (బుధవారం), రిటైల్‌ ఇన్వెస్టర్లకు 29న అందుబాటులో ఉంటుంది. కంపెనీలో 2 శాతం వాటాకు సమానమైన 12.32 కోట్ల షేర్ల విక్రయం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.5,000 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి..

ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి..

నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు.

Updated Date - May 27 , 2026 | 05:17 AM