Share News

ఎఫ్‌సీఎన్‌ఆర్‌ బీ డిపాజట్లపై మరింత వడ్డీ రేటు

ABN , Publish Date - Jun 11 , 2026 | 03:37 AM

ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) నుంచి మరిన్ని డిపాజిట్లు ఆకర్షించేందుకు సిటీ యూనియన్‌ బ్యాంక్‌ (సీయూబీ) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బీ)గా..

ఎఫ్‌సీఎన్‌ఆర్‌ బీ డిపాజట్లపై మరింత వడ్డీ రేటు

  • సిటీ యూనియన్‌ బ్యాంక్‌

హైదరాబాద్‌: ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) నుంచి మరిన్ని డిపాజిట్లు ఆకర్షించేందుకు సిటీ యూనియన్‌ బ్యాంక్‌ (సీయూబీ) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బీ)గా పిలిచే ఫారిన్‌ కరెన్సీ నాన్‌-రెసిడెంట్‌ (బ్యాంక్‌) డిపాజిట్లపై చెల్లించే వార్షిక వడ్డీ రేటును 7.10 శాతానికి పెంచింది. మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితి ఉండే ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బీ) డిపాజిట్లపై మాత్రమే ఈ వడ్డీ లభిస్తుంది. ఈ పెంపు బుధవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు సీయూబీ తెలిపింది. కాలపరిమితి తీరిన తర్వాత ఎన్‌ఆర్‌ఐలు ఈ డిపాజిట్ల అసలు, వడ్డీ ఆదాయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవచ్చు. తమ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఎన్‌ఆర్‌ఐలు తమకు అనువైన కాలపరిమితితో కూడిన ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బీ) డిపాజిట్లను ఎంచుకోవచ్చని తెలిపింది.

ఇవి కూడా చదవండి..

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారుల మృతి..

బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..

Updated Date - Jun 11 , 2026 | 03:37 AM