Share News

రండి.. పెట్టుబడులు పెట్టండి

ABN , Publish Date - Jun 13 , 2026 | 05:11 AM

చతీస్‌గఢ్‌ రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని, పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని...

రండి.. పెట్టుబడులు పెట్టండి

పారిశ్రామికవేత్తలకు చతీస్‌గఢ్‌ సీఎం సాయి పిలుపు

రూ.9,580 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): చతీస్‌గఢ్‌ రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని, పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌ సాయి పిలుపునిచ్చారు. శుక్రవారం నాడిక్కడ చతీస్‌గఢ్‌ ఇన్వెస్టర్‌ కనెక్ట్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో ఇప్పటికే రూ.8 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని ఆయన వివరించారు. పారిశ్రామిక విధానంలో భాగంగా సింగిల్‌ విండో విధానం, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాలు, సులభతరమైన అనుమతుల ప్రక్రియను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఐటీ, ఫార్మా, లాజిస్టిక్‌ రంగాల్లోని కంపెనీలు చతీస్‌గఢ్‌ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. కాగా ఇన్వెస్టర్‌ మీట్‌ సందర్భంగా ముఖ్యమంత్రి సాయి ఏడు సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సంస్థలు రూ.9,580 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా 7,800 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయని సీఎం విష్ణు దేవ్‌ సాయి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

సచిన్, కోహ్లీని వైభవ్ అధిగమిస్తాడు: డేల్ స్టెయిన్

అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు

Updated Date - Jun 13 , 2026 | 05:11 AM