Share News

మార్చిలోగా మరో రూ.7.86 లక్షల కోట్ల అప్పులు

ABN , Publish Date - Sep 26 , 2026 | 02:22 AM

కేంద్ర ప్రభుత్వ రుణ సేకరణ కొనసాగుతోంది. రుణ పత్రాల అమ్మకం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) రెండో అర్థ భాగం (అక్టోబరు-మార్చి)లో మరో రూ.7.86 లక్షల కోట్ల రుణ సేకరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది

మార్చిలోగా మరో   రూ.7.86 లక్షల కోట్ల అప్పులు
cash

  • సేకరించనున్న కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రుణ సేకరణ కొనసాగుతోంది. రుణ పత్రాల అమ్మకం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) రెండో అర్థ భాగం (అక్టోబరు-మార్చి)లో మరో రూ.7.86 లక్షల కోట్ల రుణ సేకరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే కేంద్ర బడ్జెట్‌ లక్ష్యమైన రూ.17.20 లక్షల కోట్ల రుణాల్లో రూ.8,13,506 కోట్లు సమీకరించింది. నిర్ణీత లక్ష్యానికంటే ఇది రూ.6,494 కోట్లు తక్కువ. అయితే ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద కేం ద్ర ప్రభుత్వ రుణ సేకరణ..బడ్జెట్‌లో పేర్కొన్న రూ.17.20 లక్షల కోట్ల కంటే రూ.1,20,494 కోట్లు తగ్గనుంది.

Updated Date - Sep 26 , 2026 | 02:22 AM