Share News

వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, క్రెడిట్‌ కార్డు వ్యాపారాల్లోకి సెంట్రల్‌ బ్యాంక్‌

ABN , Publish Date - Jun 01 , 2026 | 01:18 AM

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ఫీజు ఆధారిత రాబడిని పెంచుకోవడంపై దృష్టి సారిస్తోంది. ఇందు లో భాగంగా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, క్రెడిట్‌ కార్డు వ్యాపారాలను...

వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, క్రెడిట్‌ కార్డు వ్యాపారాల్లోకి సెంట్రల్‌ బ్యాంక్‌

న్యూఢిల్లీ: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ఫీజు ఆధారిత రాబడిని పెంచుకోవడంపై దృష్టి సారిస్తోంది. ఇందు లో భాగంగా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, క్రెడిట్‌ కార్డు వ్యాపారాలను ప్రారంభించే సన్నాహాల్లో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో వీటిని ప్రారంభించే యోచనలో ఉన్నట్టు బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో కల్యాణ్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు బోర్డు ఆమోదాన్ని ఇప్పటి కే బ్యాంకు పొందింది. ఈ వ్యాపారాల్ని ప్రారంభించేందుకు అవసరమైన నైపుణ్యం కలిగిన భాగస్వాములను ఎంపిక చేసుకునే నిమిత్తం రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎ్‌ఫపీ)ను జారీ చేసే ప్రక్రియ జరుగుతోందని కుమార్‌ చెప్పారు. వడ్డీయేతర ఆదాయాన్ని పెంచుకునే ఉత్పత్తులను విడుదల చేసే యోచనలో బ్యాంకు ఉందన్నారు. కార్పొరేట్‌ కస్టమర్ల కోసం ‘క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌’ అనే ప్రొడక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నామని, దీనిని ఆగస్టు నాటికల్లా ప్రారంభించబోతున్నామని చెప్పారు. విదేశీ మారక ద్రవ్య వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి.. ఖండించిన ఖర్గే

Updated Date - Jun 01 , 2026 | 01:18 AM