వచ్చే ఏప్రిల్ నుంచి కేఫ్-3 ప్రమాణాలు
ABN , Publish Date - Jul 17 , 2026 | 03:56 AM
ప్రయాణికుల వాహనాల ఇంధన సామర్థ్య ప్రమాణాలను కఠినం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి...
న్యూఢిల్లీ: ప్రయాణికుల వాహనాల ఇంధన సామర్థ్య ప్రమాణాలను కఠినం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మూడో దశ కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ (కేఫ్) ప్రమాణాలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన ముసాయిదా చర్చా పత్రాన్ని గురువారం విడుదల చేసింది. సంబంధిత వర్గాలు వచ్చే నెల 6లోగా అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. డ్రైవర్‌కాకుండా ఎనిమిది లేదా ఎక్కువ మంది ప్రయాణించే కార్లు, బస్సులు, ఎస్‌యూవీల వంటి మోటారు వాహనాలు అన్నిటికీ కేఫ్-3 నిబంధనలు వర్తిస్తాయి. ప్రతి 100 కిలోమీటర్లకు వాహనాల నుంచి వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను ప్రస్తుతం ఉన్న 94.76 గ్రాముల నుంచి 2031-32 నాటికి 78.90 గ్రాములకు కుదించడం కేఫ్-3 ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే ప్రతి 100 కిలోమీటర్లకు ప్రస్తుతం సగటున 3.996 లీటర్లుగా ఉన్న ఇంధన వినియోగాన్ని 3.3273 లీటర్లకు తగ్గించాలని ప్రతిపాదించారు.
ఈ వార్తలనూ చదవండి:
న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌పై హెచ్చరిక