పవర్‌గ్రిడ్ సీఎండీగా బుర్రా వంశీ రామ మోహన్
ABN , Publish Date - Apr 03 , 2026 | 02:33 AM
మహారత్న కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా బుర్రా వంశీ రామ మోహన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు...
హైదరాబాద్: మహారత్న కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా బుర్రా వంశీ రామ మోహన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈయన ఇదే సంస్థలో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేశారు. 1993లో పవర్ గ్రిడ్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా చేరిన రామ మోహన్.. అంచెలంచెలుగా ఎదిగి చివరికి సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎ్‌సబీ), హార్వర్డ్ మేనేజ్‌మెంట్ మెంటర్ (హెచ్‌ఎంఎం), గురుగ్రామ్‌లోని మేనేజ్‌మెంట్ డెవల్‌పమెంట్ ఇనిస్టిట్యూట్ (ఎండీఐ) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి మేనేజ్‌మెంట్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమాలు పూర్తి చేశారు.
ఇవి కూడా చదవండి...
ప్రమాదవశాత్తు సంపులో పడి 8 నెలల పసికందు మృతి
రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి
Read Latest Telangana News And Telugu News