Bullion Market Hits New Highs: బులియన్ మార్కెట్‌కు గ్రీన్‌లాండ్ సెగ
ABN , Publish Date - Jan 20 , 2026 | 06:06 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ సుంకాల పోరు బులియన్ మార్కెట్‌ను చుక్కలంటేలా చేస్తోంది. ట్రంప్ హెచ్చరికలతో సోమవారం స్పాట్, ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం, వెండి...
మరో రికార్డు స్థాయికి ధరలు
ఒక్కరోజే రూ.10,000 పెరిగిన కిలో వెండి ధర .. రూ.3,02,600కి చేరిక
అదే బాటలో పసిడి. రూ.1,900 పెరుగుదలతో రూ.1.48 లక్షలకు..
ఫ్యూచర్స్ మార్కెట్లోనూ బులియన్ భగభగలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ సుంకాల పోరు బులియన్ మార్కెట్‌ను చుక్కలంటేలా చేస్తోంది. ట్రంప్ హెచ్చరికలతో సోమవారం స్పాట్, ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరో ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారట్స్) బంగారం ఒకే రోజు రూ.1,900 పెరిగి రూ.1,48,100కు చేరి సరికొత్త రికార్డు నమోదు చేసింది. మరోవైపు కిలో వెండి ధర కూడా రూ.10,000 పెరుగుదలతో జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.3,02,600కి చేరింది.
ఫ్యూచర్స్ మార్కెట్లోనూ అదే జోరు
గ్రీన్‌లాండ్‌పై పెత్తనం కోసం ట్రంప్ చేస్తున్న హెచ్చరికల ప్రభావం సోమవారం బులియన్ మార్కెట్ ఫ్యూచర్స్‌పైనా కనిపించింది. మల్టీ కమోడిటీస్ ఎక్స్ఛేంజీ (ఎంసీఎక్స్)లో కిలో వెండి ధర ఒకే రోజు రూ.16,438 (6 శాతం) పెరిగి రూ.3,04,200కు చేరి రికార్డు సృష్టించింది. దీంతో గత వారం రోజుల్లో కిలో వెండి ధర 14 శాతం (రూ.35,037) పెరిగినట్టయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూసినా కిలో వెండి ధర ఇప్పటి వరకు 29 శాతం (రూ.68,499) లాభాలు పంచింది. పసిడి ధర కూడా వెండి బాటలోనే పయనించింది. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరిలో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.2,983 లాభంతో రూ.1,45,500కు చేరి సరికొత్త రికార్డు నమోదు చేసింది. దీంతో గత వారం రోజుల్లో 10 గ్రాముల పసిడి ధర ఫ్యూచర్స్ మార్కెట్‌లో రూ.3,698 (2.7 శాతం) పెరిగినట్టయింది.
ర్యాలీకి కారణాలు
గ్రీన్‌లాండ్‌పై ఆధిపత్యం కోసం యూరోపియన్ దేశాలపై ట్రంప్ విసిరిన సుంకాల అస్త్రం
సురక్షిత పెట్టుబడులనే నమ్మకంతో భారీగా పెరిగిన బంగారం, వెండి కొనుగోళ్లు
ప్రధాన కరెన్సీలతో తగ్గుతున్న డాలర్ మారకం రేటు
ఫారెక్స్ నిల్వల వివిధీకరణలో భాగంగా కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు
డాలర్‌తో క్షీణిస్తున్న రూపాయి మారకం రేటు
అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలు
వెండి ఎగుమతులపై చైనా అమలు చేస్తున్న లైసెన్సింగ్ విధానం
పారిశ్రామిక రంగం నుంచి బంగారం, వెండికి పెరుగుతున్న గిరాకీ
గత ఏడాది వెండి ధర 170 శాతం, పసిడి ధర 70 శాతం పెరగడం
ఇవి కూడా చదవండి..
ల్యాండింగ్ సమయంలో ఊడిన విమానం టైరు.. షాకింగ్ వీడియో వైరల్..
మీ ఐక్యూకు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న కుక్కను 5 సెకెన్లలో కనిపెట్టండి..