Share News

జీఎస్‌టీ వసూళ్లు 10 నెలల గరిష్ఠం

ABN , Publish Date - Apr 02 , 2026 | 06:13 AM

మార్చి నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 9ు వృద్ధితో 10 నెలల గరిష్ఠ స్థాయి రూ.2 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ క్రయవిక్రయాలతోపాటు దిగుమతులపై...

జీఎస్‌టీ వసూళ్లు 10 నెలల గరిష్ఠం

గత నెలలో రూ.2 లక్షల కోట్లు

గత ఆర్థిక సంవత్సరంలో మూడో అత్యధిక నెలవారీ ఆదాయం

న్యూఢిల్లీ: మార్చి నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 9ు వృద్ధితో 10 నెలల గరిష్ఠ స్థాయి రూ.2 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ క్రయవిక్రయాలతోపాటు దిగుమతులపై పన్ను రాబడి పెరగడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. దేశీయ లావాదేవీలపై జీఎస్‌టీ ఆదాయం 5.9ు పెరుగుదలతో రూ.1.46 లక్షల కోట్లుగా నమోదుకాగా.. దిగుమతులపై పన్ను రాబడి 17.8ు వృద్ధితో రూ.53,861 కోట్లకు ఎగబాకింది.

  • 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇది మూడో అత్యధిక నెలవారీ జీఎస్‌టీ రాబడి. 2025 ఏప్రిల్‌లో జీఎ్‌సటీ వసూళ్లు ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.2.36 లక్షల కోట్లకు ఎగబాకగా..మే నెలలో రూ.2.01 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

  • గత నెలలో రిఫండ్లు 13.8ుపెరిగి రూ.22,074 కోట్లకు చేరాయి. రిఫండ్లు మినహాయించగా, జీఎ్‌సటీ నికర ఆదాయం రూ.1.78 లక్షల కోట్లుగా నమోదైంది. 2025 మార్చితో పోలిస్తే ఇది 8.2్ర అధికం.

పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.22.27 లక్షల కోట్లు

2025-26 ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీఎ్‌సటీ స్థూల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 8.3ు పెరిగి రూ.22.27 లక్షల కోట్లకు చేరుకుంది. మార్కెట్లో వస్తు ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గత సెప్టెంబరులో 375 ఉత్పత్తులపై జీఎస్‌టీని తగ్గించింది. అలాగే, 5, 12, 18, 28 శాతంగా ఉన్న జీఎ్‌సటీ శ్లాబులను కేవలం 5, 18 శాతానికి కుదించింది. పొగాకు ఉత్పత్తులు, అత్యంత విలాస వస్తువులను మాత్రం 40ు పన్ను శ్లాబులో చేర్చింది. జీఎ్‌సటీ తగ్గింపుతో తొలుత జీఎ్‌సటీ ఆదాయానికి కొంత గండిపడింది. గత నవంబరులో రూ.1.70 లక్షల కోట్లు, డిసెంబరులో రూ.1.74 లక్షల కోట్లకు జారుకుంది. ఈ ఏడాది జనవరిలో రూ.1.93 లక్షల కోట్లు, ఫిబ్రవరిలో రూ.1.83 లక్షల కోట్లుగా నమోదైంది.

Updated Date - Apr 02 , 2026 | 06:13 AM