బులియన్ మార్కెట్ పైపైకి
ABN , Publish Date - Feb 24 , 2026 | 06:10 AM
బులియన్ మార్కెట్లో మళ్లీ ర్యాలీ ప్రారంభమైంది. సోమవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.3,300 లాభంతో...
10 గ్రాముల పసిడి రూ.1,62,800
కిలో వెండి ధర రూ.2.72 లక్షలు
న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్లో మళ్లీ ర్యాలీ ప్రారంభమైంది. సోమవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.3,300 లాభంతో రూ.1,62,800 వద్ద, కిలో వెండి రూ.8,000 లాభంతో రూ.2.72 లక్షల వద్ద ముగిశాయి. గత మూడు వారాల్లో బంగారం, వెండి ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు లాభాల బాట పట్టాయి. సోమవారం ఔన్స్ (31.10 గ్రాములు) 5,215 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఔన్స్ వెండి ధర 87.35 డాలర్లకు చేరింది.