కేంద్ర బడ్జెట్ 2026.. మద్యం ప్రియులకు షాక్ ఇచ్చిన కేంద్రం
ABN , Publish Date - Feb 01 , 2026 | 01:45 PM
కేంద్రం.. బడ్జెట్ 2026-27లో ఆల్కహాల్ రేట్లు పెంచే నిర్ణయం తీసుకుంది. ఆల్కహాల్ సెల్లర్స్, స్క్రాప్, మినరల్స్ నుంచి వసూలు చేస్తున్న ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్(టీసీఎస్)ను 2 శాతంగా నిర్ణయించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. బడ్జెట్ 2026-27లో ఆల్కహాల్ రేట్లు పెంచే నిర్ణయం తీసుకుంది. ఆల్కహాల్ సెల్లర్స్, స్క్రాప్, మినరల్స్ నుంచి వసూలు చేస్తున్న ట్యాక్స్ కలెక్టెడ్ యాట్ సోర్స్(టీసీఎస్)ను 2 శాతంగా నిర్ణయించింది. గతంలో ఆల్కహాల్ సెల్లర్స్, స్క్రాప్, మినరల్స్‌పై టీసీఎస్ వివిధ రకాలుగా ఉండేది. కొన్ని సార్లు చాలా ఎక్కువగా ఉండేది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ రంగాలలోని సెల్లర్స్‌కు మేలు జరగనుంది. ట్యాక్స్ సిస్టమ్ సులభతరం కానుంది.
సెల్లర్లకు పెను భారం తగ్గనుంది. ఈ ప్రకటనతో గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్టింగ్ సిస్టమ్ బిజినెస్ ఫ్రెండ్లీగా మారే అవకాశం ఉంది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆల్కహాల్ సెల్లర్లకు మంచి జరిగినా.. మద్యం తాగే వారికి మాత్రం నష్టం తప్పేలా లేదు. ఇకపై మద్యం రేట్లు పెరిగే అవకాశం ఉంది. కేవలం ఆల్కహాల్ రేట్లు మాత్రమే కాదు.. సిగరెట్లు, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై భారీగా ప్రభావం పడనుంది. వాటి రేట్లు పెరిగే అవకాశం ఉంది. కాగా, కేంద్ర ప్రభుత్వం విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్‌ను తగ్గించింది. చదువులు, వైద్యంపై టీసీఎస్‌ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది.
ఇవి కూడా చదవండి
బడ్జెట్ రోజైన ఇవాళ స్టాక్ మార్కెట్లో సునామీ
మాట కోసం... మట్టి ఇళ్లలో నివాసం!