Share News

ట్రంప్ కామెంట్స్.. మరింతగా దిగొచ్చిన చమురు ధర

ABN , Publish Date - Nov 10 , 2026 | 05:43 PM

అంతర్జాతీయ మార్కెట్‌‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర మంగళవారం మరింతగా పడిపోయింది. గత సెషెన్‌లో 6 శాతం మేర తగ్గిన ధర తాజా సెషన్‌లో మరో 3.1 శాతం మేర తగ్గి 89.62 డాలర్లుకు (బ్యారెల్ ధర) చేరుకుంది.

ట్రంప్ కామెంట్స్.. మరింతగా దిగొచ్చిన చమురు ధర
Crude oil Price Fall

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ మార్కెట్‌‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర మంగళవారం మరింతగా పడిపోయింది. గత సెషెన్‌లో 6 శాతం మేర తగ్గిన ధర తాజా సెషన్‌లో మరో 3.1 శాతం మేర తగ్గి 89.62 డాలర్లుకు (బ్యారెల్ ధర) చేరుకుంది. ఇరాన్‌పై అమెరికా దాడి చేయబోదన్న సూచనలు బలపడుతున్న నేపథ్యంలో ముడి చమురు ధర క్రమంగా దిగొస్తోంది. అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాలపై ఇరాన్ యుద్ధం తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఎన్నికల్లో ప్రజలు అధికార రిపబ్లికన్ పార్టీని తిరస్కరించి డెమోక్రాట్లకు పట్టం కట్టిన విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలో సోమవారం అధ్యక్ష్యుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై సైనిక దాడుల అవసరం ఉండకపోవచ్చని అన్నారు. అయితే, తాము ఆయుధాలతో సిద్ధంగా ఉన్నామని కూడా హెచ్చరించారు. ట్రంప్ మాటాల్లో మార్పుతో మార్కెట్‌లో ధరలు పడిపోయాయి. నాటకీయ స్థాయిలో తగ్గాయి. అక్టోబర్ చివర్లో ఆరు నెలల గరిష్ఠానికి చేరుకున్న ధరలు ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. జులై నెల తరువాత తొలిసారిగా అమెరికాలో గ్యాలన్ గ్యాసోలిన్ (పెట్రోల్) ధర 4 డాలర్ల దిగువకు చేరడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు.


సోమవారం శ్వేతసౌధం వద్ద అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ సైనికంగా ఇరాన్ పని అయిపోయినట్టేనని చెప్పారు. ఇకపై సైనిక దాడుల అవసరం ఉండకపోవచ్చని అన్నారు. ఖతారీ ప్రధానితో సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, తాము ఇప్పటికీ దాడులకు సిద్ధమేనంటూ ఇరాన్‌ను హెచ్చరించారు. ఇరాన్, అమెరికాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రస్తుతం ఖతార్ మధ్యవర్తిగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.


ఈ వార్తలనూ చదవండి:

బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!

ట్రంప్‌నకు నెతన్యాహు ఫోన్ కాల్స్.. ఇరాన్‌పై మళ్లీ దాడులకు ఒత్తిడి..

Updated Date - Nov 10 , 2026 | 06:26 PM