ఎన్‌టీపీసీ నుంచి రూ.1,338 కోట్ల ఆర్డర్
ABN , Publish Date - Jun 17 , 2026 | 03:03 AM
ఎన్‌టీపీసీ అనుబంధ సంస్థ ఎన్‌టీపీసీ రెన్యువబుల్ ఎనర్జీ నుంచి రూ.1,388 కోట్ల విలువైన భారీ ఆర్డర్‌ను బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎన్‌టీపీసీ అనుబంధ సంస్థ ఎన్‌టీపీసీ రెన్యువబుల్ ఎనర్జీ నుంచి రూ.1,388 కోట్ల విలువైన భారీ ఆర్డర్‌ను బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ దక్కించుకుంది. ఈ ఆర్డర్ కింద ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్ వద్ద ఎన్‌టీపీసీ రెన్యువబుల్ ఎనర్జీ ఏర్పాటు చేస్తున్న 250 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్ట్‌ను ఈపీసీ పద్ధతిలో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 50 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్ట్‌తో పాటు 200 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (బీఈఎ్‌సఎ్‌స)ను కంపెనీ అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టును 18 నెలల కాలంలో పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..
సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..