బొండాడ ఇంజనీరింగ్ లాభంలో 13 శాతం వృద్ధి
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:05 AM
బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్.. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్.. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.914 కోట్ల రెవెన్యూపై రూ.63 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2024-25) ఇదే కాలంతో పోల్చితే రెవెన్యూ 28 శాతం, లాభం 13 శాతం వృద్ధి చెందింది. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,843 కోట్ల మొత్తం రెవెన్యూపై రూ.211 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి
ఆంధ్ర నెట్ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం