బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్‌కు రూ.147 కోట్ల ఆర్డర్
ABN , Publish Date - Sep 26 , 2026 | 02:28 AM
ఏఐ ఫస్ట్ టెక్నాలజీ సంస్థ బ్లూ కౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్‌కు అమెరికా టెక్ దిగ్గజం ఐబీఎం క్లౌడ్ ఇంక్ నుంచి భారీ ఆర్డర్ లభించింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఏఐ ఫస్ట్ టెక్నాలజీ సంస్థ బ్లూ కౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్‌కు అమెరికా టెక్ దిగ్గజం ఐబీఎం క్లౌడ్ ఇంక్ నుంచి భారీ ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్ విలువ 1.55 కోట్ల డాలర్లు (సుమారు రూ.147 కోట్లు) ఉంటుందని తెలిపింది. అమెరికాలో ఇటీవల కొనుగోలు చేసిన గ్లోబల్ ఇంపిక్స్ ఇంక్ ద్వారా ఈ ఆర్డర్‌ను పూర్తి చేయబోతున్నట్టు వెల్లడించింది. ఈ ఆర్డర్ కింద గ్లోబల్ ఇంపిక్స్.. ఐబీఎం క్లౌడ్ కంపెనీకి ఏఐ మౌలిక సదుపాయాల డిజైన్, డిప్లాయ్‌మెంట్, సపోర్ట్ సేవలు అందించనుంది.