బిగ్ సీలో వివో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ జోన్
ABN , Publish Date - Apr 19 , 2026 | 02:22 AM
మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ సీ.. దేశంలోనే తొలిసారిగా వివో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను ప్రారంభించింది...
హైదరాబాద్: మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ సీ.. దేశంలోనే తొలిసారిగా వివో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను ప్రారంభించింది. హైదరాబాద్, అమీర్‌పేటలోని బిగ్ సీ షోరూమ్‌లో ఈ జోన్‌ను ఏర్పాటు చేసింది. వివో ఆధునిక టెక్నాలజీ, బిగ్ సీ విశ్వసనీయ సేవలు కలిసిన ఈ కొత్త జోన్.. వినియోగదారులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుందని బిగ్ సీ సీఎండీ యం బాలు చౌదరి తెలిపారు. వివో కొత్త స్మార్ట్‌ఫోన్లను మరింత సులభంగా, ఆకర్షణీయమైన ధరలకే వినియోగదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. వేసవి పురస్కరించుకుని ఏసీలపై 25 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిగ్ సీ ఈడీ యం స్వప్న కుమార్, వివో జీఎం (ఏపీ, తెలంగాణ) ఆతిష్ భార్గవ, చీఫ్ సేల్స్ ఆఫీసర్ అశ్వనీ భాస్కర్, చీఫ్ రిటైల్ ఆఫీసర్ రూపేష్ శర్మ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్
ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్