భారత్‌లో ‘ఆఫ్‌లైన్’ సైబర్ దాడుల కలకలం
ABN , Publish Date - Mar 26 , 2026 | 05:26 AM
ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే సైబర్ దాడుల నుంచి సురక్షితంగా ఉన్నామని భావించ డం పొరపాటేనని, ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా కూడా...
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే సైబర్ దాడుల నుంచి సురక్షితంగా ఉన్నామని భావించ డం పొరపాటేనని, ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా కూడా దాడుల ముప్పు తీవ్రంగానే ఉన్నదని అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పెర్‌స్కై హెచ్చరించింది. 2025లో భారత్‌లోని ప్రతి ముగ్గురు కంప్యూటర్ వినియోగదారుల్లో ఒకరు లోకల్ లేదా ఆఫ్‌లైన్ దాడులకు గురైనట్లు తాజా నివేదికలో వెల్లడించింది. గత సంవత్సరం జనవరి నుంచి డిసెంబరు మధ్య కాలంలో దాదాపు 6.4 కోట్లకు పైగా లోకల్ సైబర్ సంఘటనను గుర్తించి బ్లాక్ చేసినట్టు సంస్థ పేర్కొంది. ఈ దాడులు ప్రధానంగా యూఎ్‌సబీ డ్రైవ్‌లు, ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్‌లు వంటి ఇతర రిమూవబుల్ డివై్‌సల ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!
ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్