బీఓఐ ఎఫ్‌డీ రేట్ల పెంపు
ABN , Publish Date - May 19 , 2026 | 02:08 AM
ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) మధ్య, దీర్ఘకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను సోమవారం నుంచే అమల్లోకి వచ్చేలా పెంచింది....
ముంబై: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) మధ్య, దీర్ఘకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను సోమవారం నుంచే అమల్లోకి వచ్చేలా పెంచింది. ఏడాది నుంచి రెండేళ్లలోపు కాలపరిమితితో కూడిన రూ.3 కోట్లలోపు డిపాజిట్‌పై చెల్లించే వార్షిక వడ్డీ రేటును 6.50 శాతానికి పెంచింది. రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు డిపాజిట్‌పై వడ్డీ రేటు 6.6శాతానికి, మూడేళ్ల ఎఫ్‌డీ రేటు 6.70 శాతానికి పెరిగింది. 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 0.65శాతం అదనపు వడ్డీ చెల్లించనున్నట్టు బ్యాంక్ స్పష్టం చేసింది. 3 ఏళ్లు, అంతకుపైగా కాలపరిమితి ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు 0.75 శాతం, సూపర్ సీనియర్ సిటజన్లకు 0.90 శాతం అధిక వడ్డీ చెల్లించనుంది.
ఇవి కూడా చదవండి..
సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. మార్కులు పెరిగితే రీ-ఎవాల్యుయేషన్ ఫీజు పూర్తిగా రీఫండ్..
ఉగ్రవాదికి బట్టతల కష్టాలు.. దాడులు చేయడానికి భారత్‌లోకి చొరబడి..