Share News

అరబిందో ఫార్మా రూ.800 కోట్ల బైబ్యాక్‌

ABN , Publish Date - Apr 07 , 2026 | 03:08 AM

అరబిందో ఫార్మా షేర్ల బైబ్యాక్‌ ప్రకటించింది. వాటాదారుల నుంచి 54,23,728 షేర్లను ఒక్కో షేరు రూ.1,475 చొప్పున బైబ్యాక్‌...

అరబిందో ఫార్మా రూ.800 కోట్ల బైబ్యాక్‌

ఒక్కో షేరుకు రూ.1,475

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అరబిందో ఫార్మా షేర్ల బైబ్యాక్‌ ప్రకటించింది. వాటాదారుల నుంచి 54,23,728 షేర్లను ఒక్కో షేరు రూ.1,475 చొప్పున బైబ్యాక్‌ చేయనున్నట్టు తెలిపింది. కంపెనీ ప్రస్తుత ఈక్విటీ మూలధనంలో ఇది దాదాపు 0.93 శాతానికి సమానం. సోమవారం బీఎ్‌సఈలో కంపెనీ షేరు ముగింపు ధర (రూ.1,339.80)తో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం ఎక్కువ. ఈ బైబ్యాక్‌ కోసం రూ.800 కోట్లు ఖర్చవుతాయని అంచనా. సోమవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ నాటికి కంపెనీ రికార్డుల్లో వాటాలు ఉన్న వాటాదారులు అందరూ ఈ బైబ్యాక్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అరబిందో ఫార్మా వెల్లడించింది.

ఈ వార్తలూ చదవండి:

బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

ఈసారికి రెపో యథాతథమే!

Updated Date - Apr 07 , 2026 | 03:08 AM