హైదరాబాద్‌లో రూ.500 కోట్లతో కొత్త హాస్పిటల్
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:11 AM
ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్.. హైదరాబాద్‌లో కొత్త హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌లోని...
ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్.. హైదరాబాద్‌లో కొత్త హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో 300 పడకల సామర్థ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆస్టర్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆజాద్ మూపెన్ వెల్లడించారు. రూ.500 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న ఈ హాస్పిటల్ వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి రానుందని తెలిపారు. కొండాపూర్ హాస్పిటల్‌తో హైదరాబాద్‌లో మొత్తం పడకల సామర్థ్యం 1,700కి చేరుకుంటుందన్నారు. వచ్చే రెండేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా రూ.4,000 కోట్ల పెట్టుబడితో ప్రస్తుత హాస్పిటల్స్ విస్తరణ, కొత్త ఆస్పత్రుల ఏర్పాటుతో అదనంగా 4,000 -4,400 పడకలను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యానికి అనుగుణంగా హైదరాబాద్‌లో ఈ విస్తరణను చేపట్టినట్లు మూపెన్ పేర్కొన్నారు. ప్రతిపాదిత పెట్టుబడులతో దేశవ్యాప్తంగా ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ మొత్తం పడకల సామర్థ్యం 15,000కి చేరుకుంటుందని ఆయన వివరించారు. ఆస్టర్‌కు హైదరాబాద్ మార్కెట్ చాలా కీలకంగా ఉందని దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త హాస్పిటల్ ఏర్పాటుతో పాటు ప్రస్తుత హాస్పిటల్స్‌ను కూడా విస్తరిస్తున్నట్లు సంస్థ ఎండీ, గ్రూప్ సీఈఓ వరుణ్ ఖన్నా తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి ప్రయత్నాలు.. మద్దతుగా మస్క్
ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్య.. అమెరికాలో విమాన సేవల నిలిపివేత..