Share News

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు

ABN , Publish Date - Mar 29 , 2026 | 07:58 PM

ఏప్రిల్ 1 నుంచి పలు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మరి అవేంటో వివరంగా తెలుసుకుందాం పదండి.

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు
April 1 new rules India,

ఇంటర్నెట్ డెస్క్: పన్నులు, బ్యాంకింగ్ తదితర అంశాలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త మార్పులు రానున్నాయి. అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం

ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం అమల్లోకి రానుంది. 1961 నాటి చట్టం స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు. కొత్త చట్టంలో పన్ను శ్లాబ్స్‌లో మార్పులు లేకపోయినప్పటికీ ట్యాక్స్ ఫైలింగ్‌ను సులభతరం చేసేలా కొత్త చట్టంలో నిబంధనలను రూపొందించారు. మునుపటి ఫైనాన్షియల్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్‌ల స్థానంలో ట్యాక్స్ ఇయర్‌ను ప్రవేశపెట్టారు.

హెచ్ఆర్ఏ బెనిఫిట్స్! మరో నాలుగు నగరాలకు..

హౌజ్ రెంట్ అలొవెన్స్ (హెచ్‌ఆర్ఏ) కింద 50 శాతం పన్ను మినహాయింపు (బేసిక్ శాలరీలో) పొందే సౌకర్యం మరో నాలుగు నగరాలకు విస్తరించారు. ఢిల్లీ, ముుంబై, కోల్‌కతా, చెన్నైలతో పాటు హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు నగరాలకూ విస్తరించేలా మార్పులు చేశారు.


కొత్త లేబర్ కోడ్

ఇక తాజా లేబర్ కోడ్ ప్రకారం, సీటీసీలో బేసిక్ శాలరీ వాటా కనీసం 50 శాతంగా ఉండాలి. దీంతో, పీఎఫ్, గ్యాట్యుయిటీ కాంట్రిబ్యూషన్లు పెరుగుతాయి. ఇది కూడా ఏప్రిల్ 1 నుంచీ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్

ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్‌పై విధించే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కూడా ఏప్రిల్ 1 నుంచి పెరగనుంది. ఆ మేరకు ట్రేడింగ్ ఖర్చులు పెరుగుతాయి.

పాన్ నిబంధనల మార్పు

పాన్ నిబంధనలు కఠినతరం కానున్నాయి. గతంలో పాన్ కార్డు పొందేందుకు ఆధార్ కార్డు సరిపోయేది. ఇకపై ఓటర్ ఐడీ, పాస్ పోర్టు, బర్త్ సర్టిఫికేట్ వంటివి అవసరం అయ్యే అవకాశం ఉంది.

రిఫండ్ రూల్స్ మార్పు
ఇకపై రైలు బయలుదేరే సమయానికి 8 గంటల లోపల టికెట్ రద్దు చేసుకున్నట్టైతే ఎలాంటి రీఫండ్ లభించదు. గతంలో ఇది నాలుగు గంటలుగా ఉండేది. రైలు జర్నీ సమయానికి ముందు 24 గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య టికెట్‌ను క్యాన్సిల్ చేసుకుస్తే 50 శాతం, 72-24 గంటల మధ్య టికెట్లు రద్దు చేసుకుంటే 25 శాతం మొత్తాన్ని మినహాయిస్తారు. రైలు బయల్దేరడానికి కనీసం 72 గంటల సమయం ఉండగా టికెట్లను రద్దు చేసుకుంటే క్యాన్సిలేషన్‌ రుసుమును మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగిస్తారు.

ఇప్పటికే ఇంట్లో వాడే వంటగ్యాస్ సిలిండర్ ధర, వాణిజ్య సిలిండర్ ధర పెరిగాయి. ఈ ధరలతో పాటు విమాన ఇంధన ధరలను కేంద్రం మరోసారి సమీక్షించే అవకాశం ఉంది.


ఈ వార్తలూ చదవండి:

ఆటుపోట్ల మార్కెట్లో మదుపరుల వ్యూహం ఎలా?

బ్యాంకింగ్‌లో కొత్త నిబంధనలు

Updated Date - Mar 29 , 2026 | 10:04 PM