Share News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా అనూప్‌ బాగ్చీ

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:45 AM

హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌.. కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా అనూప్‌ బాగ్చీ నియమితులయ్యారు...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా అనూప్‌ బాగ్చీ

న్యూఢిల్లీ: హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌.. కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా అనూప్‌ బాగ్చీ నియమితులయ్యారు. ఈ నెల 27న బాగ్చీ ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. మూడేళ్ల కాలపరిమితి గాను ఆయన నియామకాన్ని ఆర్‌బీఐ ఆమోదించింది. ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓగా బాగ్చీ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ శశిధర్‌ జగదీశన్‌ పదవీ కాలం ఈ నెల 26న ముగియనుంది. మరోసారి ఎండీ, సీఈఓ పదవిలో కొనసాగేందుకు ఆసక్తి లేదని జగదీశన్‌ ఆగస్టులోనే బ్యాంకు బోర్డుకు తెలియజేయటంతో ఆయన స్థానంలో అనూప్‌ బాగ్చీని ఈ పదవికి ఎంపిక చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూకుడు.. సెప్టెంబర్‌లో రూ.5,327 కోట్లు

రూ. 9లక్షల కోట్లు ఆవిరి.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..

Updated Date - Oct 02 , 2026 | 05:45 AM