Share News

ఏఐపై ఆందోళన.. ఆంథ్రోపిక్ షేర్ల పతనం

ABN , Publish Date - Nov 20 , 2026 | 10:54 PM

భారీ అంచనాలతో స్టాక్ మార్కెట్‌‌లో ఆరంగేట్రం చేసిన ఏఐ సంస్థ ఆంథ్రోపిక్‌కు శుక్రవారం ఎదురుగాలులు వీచాయి.

ఏఐపై ఆందోళన.. ఆంథ్రోపిక్ షేర్ల పతనం
Anthropic stock Fall

ఇంటర్నెట్ డెస్క్: భారీ అంచనాలతో స్టాక్ మార్కెట్‌‌లో ఆరంగేట్రం చేసిన ఏఐ సంస్థ ఆంథ్రోపిక్‌కు శుక్రవారం ఎదురుగాలులు వీచాయి. నేటి ట్రేడింగ్‌లో కంపెనీ షేరు విలువ 10 శాతం మేర పడిపోయింది. ఏఐ రంగంలోకి భారీ పెట్టుబడులపై సందేహాలు, రాబడులపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో సంస్థ షేర్ విలువ తగ్గింది. ఏతో పాటు ఆసియా, ఐరోపా మార్కెట్లలో కూడా విక్రయాలు కనిపించాయి. యూస్ స్టాక్స్ ఫ్యూచర్స్ కూడా పతనమయ్యాయి. సురక్షిత పెట్టుబడులపైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో ప్రభుత్వ బాండ్స్‌కు డిమాండ్ పెరిగింది.

ఆంథ్రోపిక్ గురువారం నాడు మార్కెట్లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మదపర్ల ఆసక్తి పెరగడంతో 34 శాతం మేర షేర విలువ పెరిగింది. కానీ మొదటి రోజు మదుపర్లలో కనిపించిన ఉత్సాహం రెండో రోజు కాస్త తగ్గడంతో సంస్థ షేర్లు డీలా పడ్డాయి.


కృత్రిమ మేధ సంబంధిత మౌలిక వసతుల కల్పనపై ఏఐ కంపెనీలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతుండటంపై మదుపర్లు ఆందోళనతో ఉన్నారు. రాబడులపై స్పష్టత లేకున్నా సంస్థలు ఏఐ విషయంలో దూకుడుగా ఉండటం ఇన్వెస్టర్లలో గుబులు రేపుతోంది. ఏఐకి భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుందన్న సంకేతాలతో మదుపర్లు ప్రస్తుతం సంతృప్తి చెందటం లేదని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటివరకూ పెట్టిన పెట్టుబడులపై దీర్ఘకాలిక లాభాలు ఆశిస్తున్నారని అంటున్నారు.

గత కొన్ని వారాలుగా ఏఐ రంగం ఒత్తిడిని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనికి తోడు ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ నెలకొన్న వివాదం కూడా మదుపర్లలో ఏఐపై ఉత్సాహాన్ని తగ్గించింది. ఏఐ సేవలకు కీలకమైన డేటా సెంటర్లను అమెరికాలో ప్రతిపక్ష డెమోక్రాట్లు వ్యతిరేకిస్తుండటం కూడా మదుపర్లపై ప్రభావం చూపిస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

నాస్‌డాక్, హాంకాంగ్‌ను అధిగమించి ప్రపంచంలో 5వ అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా మన NSE

ఆంథ్రోపిక్‌ ఉద్యోగుల్లో దాదాపు అందరూ మిలియనీర్లే

Updated Date - Nov 20 , 2026 | 10:55 PM