పప్పులో కాలేసిన ఆంథ్రోపిక్
ABN , Publish Date - Apr 02 , 2026 | 06:00 AM
తన ఏఐ టూల్స్‌తో ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగాన్ని షేక్ చేస్తున్న అమెరికా టెక్ దిగ్గజం ఆంథ్రోపిక్ పప్పులో కాలేసింది. ఈ సంస్థకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన ఏఐ కోడింగ్ ఏజెంట్...
కీలక ఏఐ టూల్ ‘క్లాడ్’ కోడ్ బహిర్గతం
న్యూఢిల్లీ: తన ఏఐ టూల్స్‌తో ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగాన్ని షేక్ చేస్తున్న అమెరికా టెక్ దిగ్గజం ఆంథ్రోపిక్ పప్పులో కాలేసింది. ఈ సంస్థకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన ఏఐ కోడింగ్ ఏజెంట్ ‘క్లాడ్ కోడ్’ ఫుల్‌సోర్స్ కోడ్ బయటికి పొక్కింది. సైబర్ కేటుగాళ్ల ప్రమేయం లేకుండా తానే పొరపాటుగా ఈ కోడ్‌ను లీక్ చేసింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ ‘క్లాడ్‌కోడ్’ ఫుల్‌సోర్స్ కోడ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు వరంగా మారుతుందని భావిస్తున్నారు. ఆంథ్రోపిక్ కంపెనీకి చెందిన ఏఐ ఆధారిత టూల్స్ ఇలా లీకవడం ఇదే తొలి సారి కాదు. గతంలోనూ రెండుసార్లు ఇలానే కంపెనీకి చెందిన కీలక ఏఐటూల్స్ సోర్స్ కోడ్‌లు లీకయ్యాయి.
ఐపీఓపై ప్రభావం: ఆంథ్రోపిక్ ఈ సంవత్సరం అక్టోబరులో 38,000 కోట్ల డాలర్ల (సు మారు రూ.35.98 లక్షల కోట్లు) వాల్యుయేషన్‌తో ఐపీఓకి రావాలని భావిస్తోంది. ఇప్పుడు ఇలా తన కీలక క్లాడ్ కోడ్ సెక్యూరిటీ అప్‌డేట్ లీకవడం కంపె నీ ఐపీఓ ప్రయత్నాలను దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ విడుదల చేసిన క్లాడ్ కోవర్క్ ఏఐ టూల్స్‌తో సాఫ్ట్‌వేర్, లీగల్, ఐటీ సేవల కంపెనీల షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్షల కోట్ల రూపాయలు తుడిచిపెట్టుకుపోయిం ది. ఇప్పుడు క్లాడ్ కోడ్ ఏఐ ఏజెంటిక్ టూల్ కీలక సోర్స్ లీకవడం స్టాక్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని మార్కెట్ వర్గాలు ఆందోళనతో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి...
అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత
మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్
Read Latest AP News And Telugu News