అనిల్ అంబానీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్
ABN , Publish Date - Sep 19 , 2026 | 02:35 AM
నిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీపై సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అనిల్ అంబానీతో పాటు గ్రూప్ మాజీ ఎండీ సతీష్ సేథ్, గుర్తు తెలియని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులపైనా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది
న్యూఢిల్లీ: అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీపై సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అనిల్ అంబానీతో పాటు గ్రూప్ మాజీ ఎండీ సతీష్ సేథ్, గుర్తు తెలియని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులపైనా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. వీరంతా 2012 ఏప్రిల్ - 2018 మార్చి మధ్య కాలంలో వివిధ గ్రూప్ కంపెనీల వ్యాపార అవసరాల పేరు మీద ఎన్‌సీడీల ద్వారా తమ నుంచి సమీకరించిన రూ.2,684.57 కోట్ల నిధులను దారి మళ్లించి స్వాహా చేశారన్న ఎల్‌ఐసీ రాతపూర్వక ఫిర్యాదుతో సీబీఐ ఈ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. తప్పుడు హామీలతో తమ నుంచి సమీకరించిన ఈ నిధులను అనిల్ అంబానీ, ఆయన నేతృత్వంలోని కంపెనీలు దారి మళ్లించి స్వాహా చేశాయని ఎల్‌ఐసీ ఫిర్యాదు చేసింది. అయితే అనిల్ అంబానీ ఈ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రకటించారు.