అమ్మాన్ ఇండియా నుంచి రీసైక్లింగ్ సొల్యూషన్స్
ABN , Publish Date - Jun 20 , 2026 | 05:03 AM
రహదారుల నిర్మాణ పరికరాల సంస్థ అమ్మాన్ ఇండియా.. రీసైక్లింగ్ టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. రహదారుల నిర్మాణంలో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): రహదారుల నిర్మాణ పరికరాల సంస్థ అమ్మాన్ ఇండియా.. రీసైక్లింగ్ టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. రహదారుల నిర్మాణంలో ఉపయోగించే ఆస్ఫాల్ట్ (బిట్యుమిన్) కోసం అడ్వాన్స్‌డ్ రీసైక్లింగ్ సొల్యూషన్స్‌ను తీసుకువచ్చినట్లు సంస్థ ఎండీ ధీరజ్ పాండా తెలిపారు. దిగుమతుల భారాన్ని తగ్గించుకోవటంతో పాటు దేశీయంగా ఉన్న ఉత్పత్తులను రీసైక్లింగ్ చేసి ఉపయోగించుకోవటం ద్వారా రహదారుల నిర్మాణ కంపెనీలపై భారం కూడా తగ్గుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రహదారులు, నిర్మాణ కంపెనీల ఆధ్వర్యంలో 300కు పైగా ఆస్ఫాల్ట్ ప్లాంట్లు ఉండగా వాటిల్లో 25 శాతం ప్లాంట్లను ఇప్పటికే రీసైక్లింగ్ టెక్నాలజీలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేపట్టినట్లు పాండా తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి రిషభ్ పంత్?
భారత హెల్మెట్ ధరించి.. సెంచరీ బాదిన సంగక్కర!