300 నగరాలకు అమెజాన్ నౌ విస్తరణ
ABN , Publish Date - Jun 25 , 2026 | 05:52 AM
దేశంలో తన అల్ర్టా ఫాస్ట్ డెలివరీ సర్వీసు ‘అమెజాన్ నౌ’ను అమెజాన్ మరింత విస్తరించనుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 300కు పైగా నగరాలకు విస్తరించాలనుకుంటున్నట్టు...
న్యూఢిల్లీ: దేశంలో తన అల్ర్టా ఫాస్ట్ డెలివరీ సర్వీసు ‘అమెజాన్ నౌ’ను అమెజాన్ మరింత విస్తరించనుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 300కు పైగా నగరాలకు విస్తరించాలనుకుంటున్నట్టు కంపెనీ పేర్కొంది. దీంతో దేశంలో అతిపెద్ద ‘డెలివరీ ఇన్ మినిట్స్’ నెట్‌వర్క్‌ను నిర్మించాలనుకుంటోంది. ఈ ప్రకటన భారత్‌పై పెరుగుతున్న అమెజాన్ ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. ఈ కంపెనీ ఈకామర్స్, లాజిస్టిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధపై దూకుడుగా పెట్టుబడి పెడుతోంది. భారత్‌లో తమ కార్యకలాపాల్లో అమెజాన్ నౌ వేగంగా వృద్ధి చెందుతున్న వ్యాపారమని కంపెనీ పేర్కొంది. దీన్ని ప్రారంభించినప్పటి నుంచి ప్రతి త్రైమాసికంలో ఆర్డర్ల పరిమాణం రెండింతలు అవుతున్నట్టు తెలిపింది. కాగా అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ భారత్ పర్యటనకు వచ్చారు. బుధవారం ముంబైలోని అమెజాన్ నౌ మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను సందర్శించారు. తర్వాత పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు.
ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ @: 1000 మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు
ఫ్లిప్‌కార్ట్ క్విక్ కామర్స్ విభాగమైన ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల సంఖ్య దేశంలోని 130కి పైగా నగరాలు, 8వేలకు పైగా పిన్‌కోడ్స్ పరిధిలో వెయ్యిని దాటింది. 2024 ఆగస్టులో దీన్ని ప్రారంభించగా.. రెండేళ్లలోపే తాజా మైలురాయిని అధిగమించింది. గత ఏడాదితో పోల్చితే ప్లాట్‌ఫామ్‌పై ఆర్డర్లు 5 రెట్లకు పైగా పెరిగినట్టు కంపెనీ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
నేరారోపణలు ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అమెరికా ప్రవేశం నిరాకరణ: సుప్రీంకోర్టు కీలక తీర్పు
భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్.. లాభాల్లో దేశీయ సూచీలు