Share News

రెన్యువబుల్‌ ప్రాజెక్టులపై రూ.65,450 కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:28 AM

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. భారత పునరుత్పాదక (రెన్యువబుల్‌) ఇంధన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇందులో...

రెన్యువబుల్‌ ప్రాజెక్టులపై రూ.65,450 కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. భారత పునరుత్పాదక (రెన్యువబుల్‌) ఇంధన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా 2030 నాటికి ఈ ప్రాజెక్టుల్లో మరో 700 కోట్ల డాలర్లు (సుమారు రూ.65,450 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపింది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ల్లో 934 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేసే నాలుగు పవన, సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల్లో ఈ మొత్తాన్ని పెట్టుబడి గా పెట్టనుంది. అమెజాన్‌ ఇప్పటికే భారత రెన్యువబుల్‌ ఇంధన ప్రాజెక్టుల్లో 400 కోట్ల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టింది.

ఇవి కూడా చదవండి..

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరానికి సమీపంలో ట్యాంకర్‌కు మంటలు..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 18 , 2026 | 05:28 AM