అమర రాజా లాభం రూ.314 కోట్లు
ABN , Publish Date - May 26 , 2026 | 05:36 AM
అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ.. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ.. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో కన్సాలిడేట్ ప్రాతిపదికన రూ.314.30 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం 95 శాతం (రూ.161.60 కోట్లు) వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో రెవెన్యూ 15.5 శాతం పెరిగి రూ.3,060.10 కోట్ల నుంచి రూ.3,535.80 కోట్లకు చేరుకుంది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో రూ.1 ముఖవిలువ కలిగిన ప్రతి షేరుకు రూ.5.20 (520ు) తుది డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..