Share News

ఈ ఏడాది రూ.1,700 కోట్ల పెట్టుబడులు: అమర రాజా

ABN , Publish Date - May 28 , 2026 | 02:51 AM

అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ పెద్దఎత్తున వ్యాపార విస్తరణకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో కార్యకలాపాల విస్తరణ కోసం...

ఈ ఏడాది రూ.1,700 కోట్ల పెట్టుబడులు: అమర రాజా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ పెద్దఎత్తున వ్యాపార విస్తరణకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో కార్యకలాపాల విస్తరణ కోసం రూ.1,500 కోట్ల నుంచి రూ.1,700 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో రూ.400 కోట్లు లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీ ప్లాంటు ఉత్పత్తి సామర్ధ్య విస్తరణ కోసం ఉపయోగించనుండగా.. రూ.1,100 కోట్ల నుంచి రూ.1,200 కోట్లు మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లి వద్ద అమర రాజా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీస్‌ పేరుతో ఏర్పాటు చేస్తున్న లిథి యం అయాన్‌ బ్యాటరీలు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్‌ (బీఈఎస్ఎన్) తయారీ యూనిట్‌ కోసం వెచ్చిచంనున్నట్లు సంస్థ సీఎస్ఓ వై డెల్లీ బాబు తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌ కల్లా దివిటిపల్లిలో ఏర్పాటు చేస్తున్న ప్లాంటులో తొలిదశలో రెండు గిగావాట్ల (2,000 మెగావాట్లు) సామర్ధ్యం ఉన్న లిథియం అయాన్‌ బ్యాటరీలు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్‌ (బీఈఎ్‌సఎ్‌స)ఉత్పత్తి సామర్ధ్యం అందుబాటులోకి వస్తుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (న్యూ ఎనర్జీ బిజినెస్‌) గౌరినేని విక్రమాదిత్య తెలిపారు. దివిటిపల్లిలో ముందు ఐదు గిగావాట్లతో ప్రారంభమయ్యే బీఈఎస్ఎన్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని క్రమంగా 10 గిగావాట్లకు పెంచనున్నట్టు విక్రమాదిత్య తెలిపారు.

ఇవి కూడా చదవండి..

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి.

Updated Date - May 28 , 2026 | 02:51 AM