Share News

ఏఎం ఇంటెలిజెన్స్‌ విస్తరణ బాట

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:16 AM

గ్రీన్‌కో గ్రూప్‌నకు చెందిన ఏఐ మౌలిక వసతుల ప్లాట్‌ఫామ్‌ ఏఎం ఇంటెలిజెన్స్‌ (ఏఎంఐ) తన డేటా సెంటర్‌ సామర్థ్యాన్ని...

ఏఎం ఇంటెలిజెన్స్‌ విస్తరణ బాట

20,000 ఎన్‌విడియా రుబిన్‌ జీపీయూలకు ఆర్డర్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గ్రీన్‌కో గ్రూప్‌నకు చెందిన ఏఐ మౌలిక వసతుల ప్లాట్‌ఫామ్‌ ఏఎం ఇంటెలిజెన్స్‌ (ఏఎంఐ) తన డేటా సెంటర్‌ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు వచ్చే 15 నెలల్లో 2,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.92 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్టు ప్రకటించింది. భారత్‌, మలేషియాలో సిస్టమ్స్‌ ఏర్పాటు కోసం తాజాగా 20,000 ఎన్‌విడియా రుబిన్‌ జీపీయూల కోసం రెండు ఆర్డర్లు ఇచ్చినట్టు సోమవారం కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌లోని తన తొలి ఏఐ ఫ్యాక్టరీలో 30 మెగావాట్ల సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడానికి 9,000 ఎన్‌విడియా రుబిన్‌ జీపీయూలకు ఆర్డరు ఇచ్చినట్టు కంపెనీ ఇప్పటికే తెలిపింది. తాజా ఆర్డర్లతో కలిపి ఏఎంఐ మొత్తం సామర్థ్యం దాదాపు 29,000 జీపీయూలకు చేరుతుంది. 20,000 జీపీయూలకు ఇచ్చిన ఆర్డర్ల ద్వారా సమకూరే 70 మెగావాట్ల అదనపు సామర్థ్యాన్ని భారత్‌, మలేషియాలో ఏర్పాటు చేయనున్నామని, వీటి డెలివరీ వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో జరుగుతుందని కంపెనీ తెలిపింది. దీంతో మొత్తం సామర్థ్యం 100 మెగావాట్లకు చేరుకోనుంది. వచ్చే 15 నెలల్లో మరో 300 మెగావాట్ల సామర్థ్యాన్ని మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటున్నట్టు కంపెనీ తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

త్వరలో GST కౌన్సిల్ భేటీ.. సంచలన సంస్కరణలకు శ్రీకారం!

స్థిరంగా పసిడి ధరలు.. ప్రస్తుతం రేట్స్ ఇవీ

Updated Date - Oct 06 , 2026 | 04:16 AM